మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ఓ ప్రైవేటు పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పేపర్ ముద్రణ యంత్రం, పేపర్ రోల్స్ కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపుచేశారు. విద్యుదాఘాతం కారణమని అధికారులు భావిస్తున్నారు. సుమారు రూ.30 లక్షల వరకు నష్టం వాటిల్లిందని ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. ఘటన ప్రాంతంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి.
ఇవీచదవండి:మోదీ ప్రపంచ రికార్డ్!