మేడ్చల్ జిల్లా పూడూరు గ్రామ పరిధిలోని హరిహర పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో అకస్మాత్తుగా మంటలు వ్యాప్తి చెంది పక్కనే ఉన్న ఫాస్ట్ఫుడ్ సెంటర్ పూర్తిగా దగ్ధమైంది. మంటలు విస్తరిస్తున్న క్రమంలో అటువైపు నుంచి వెళ్తున్న పూడూరు గ్రామస్థులు యాదమ్మ, రాజబొల్లారం తండాకు చెందిన దుర్గయ్యకు స్వల్ప గాయాలయ్యాయి.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో 108 సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని బాధితులకు చికిత్స అందించారు. వేగంగా విస్తరిస్తున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చింది.
ఇదీ చదవండి: నా భర్తను ఎలా మార్చుకోవాలి?