హైదరాబాద్ కాప్రా గాంధీనగర్ అపోలో ఫార్మసీలో ఎగ్జిక్యూటివ్ సిబ్బంది జీతాలు సరిగా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఓ యువతి కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కింది స్థాయి ఉద్యోగుల జీతాల్లో నుంచి కోత పేరుతో ప్రతి నెల రూ. 5 వేల నుంచి 8 వేల వరకు కాజేస్తున్నారని మహిళా ఉద్యోగి జెస్సీ ఆరోపించింది.
తమకు వచ్చే చాలీచాలని జీతంలో నుంచి డబ్బులు తీసుకుంటే తాము ఎలా బతకాలంటూ వాపోయింది. ఇదేంటని నిలదీస్తే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ మా దగ్గర ఉన్నాయని బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తమకు న్యాయం చేయాలని కోరింది.
ఇదీ చదవండి: రామాంతపూర్‌లో వర్షం నష్టాన్ని పరిశీలించిన కిషన్‌రెడ్డి