మేడ్చల్ జిల్లా షామిర్పేట్ మండలం పొన్నాల గ్రామానికి చెందిన పర్వత రెడ్డి వ్యవసాయ బావి వద్ద మోటర్ వేయడానికి వెళ్లాడు. మోటర్ నడవకపోవడం వల్ల దగ్గరలో ఉన్న ట్రాన్స్ ఫారమ్ వద్దకు వెళ్లి పరిశీలించే క్రమంలో విద్యుత్ షాక్కు గురై మరణించాడు. పర్వతరెడ్డి మృతికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు.
ఇవీ చూడండి: మహబూబ్నగర్ జిల్లాలో ఘోర ప్రమాదం.. 12 మంది మృతి