2024 Maruti Dzire: మీరు కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే ఇటీవలే మారుతి సుజుకి తన కొత్త మారుతి డిజైర్‌ను తీసుకొచ్చింది. ప్రీమియం ఫీచర్లతో బడ్జెట్ ధరలోనే లాంఛ్ చేసింది. ఈ కారును మారుతి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా రూపొందించారు. ఇది ఒకే ప్లాట్‌ఫారమ్, ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. అయితే ఈ కారు లుక్ చాలా భిన్నంగా ఉంటుంది.
అంతేకాక మారుతి స్విఫ్ట్, దాని పాత మోడల్లో పోలిస్తే దీని ఎక్విప్మెంట్ పరంగా కూడా ఇది ఒక అడుగు ముందుంది. కంపెనీ ఈ కొత్త మారుతి డిజైర్‌ను రూ. 6.79 లక్షల ప్రారంభ ధరతో లాంఛ్ చేసింది. అయితే టాప్-స్పెక్ మోడల్ ధర రూ. 10.14 లక్షలు (ఎక్స్-షోరూమ్, దిల్లీ). నాలుగు ట్రిమ్ ఆప్షన్లలో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మారుతి డిజైర్ ధర, ఫీచర్లపై మరిన్ని వివరాలు మీకోసం.
2024 మారుతి సుజుకి డిజైర్ ట్రిమ్స్: కంపెనీ ఈ కొత్త మారుతి డిజైర్‌ను నాలుగు ట్రిమ్ ఆప్షన్స్‌లో తీసుకొచ్చింది.
- LXi
- VXi
- ZXi
- ZXi+
పవర్‌ట్రెయిన్ అండ్ మైలేజ్: కొత్త మారుతి డిజైర్ స్విఫ్ట్ మాదిరిగానే ఇందులో కూడా 1.2-లీటర్, 3-సిలిండర్, Z12E పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 80 bhp పవర్, 112 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో నాలుగు ట్రిమ్‌లలో స్టాండర్డ్‌గా వస్తుంది. ఇది కాకుండా కొత్త డిజైర్ లాంచ్ తర్వాత CNG పవర్‌ట్రైన్‌ను కూడా అందుబాటులో ఉంది. ఇది మిడ్-స్పెక్ VXi, ZXi ట్రిమ్‌లలో లభిస్తుంది.
CNG పవర్‌ట్రెయిన్ కేవలం 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తోనే వస్తుంది. ఈ పవర్‌ట్రెయిన్ CNG ఫ్యూయల్‌పై 68 bhp పవర్, 101.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కొత్త డిజైర్ ARAI-రేటెడ్ మైలేజ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో 24.79kpl, AMT గేర్‌బాక్స్‌తో 25.71kpl. అదే సమయంలో దీని CNG వేరియంట్‌లపై 33.73km/kg మైలేజీని అందిస్తుంది.
2024 మారుతి సుజుకి డిజైర్ వేరియంట్ వారీగా ఫీచర్లు:
1. 2024 Maruti Dzire LXi:
- పవర్‌ట్రెయిన్: పెట్రోల్-MT
- ప్రొజెక్టర్ హాలోజన్ హెడ్‌లైట్స్
- LED టెయిల్-లైట్స్
- కవర్లు లేకుండా 14-అంగుళాల స్టీల్ వీల్స్
- షార్క్ ఫిన్ యాంటెన్నా
- బ్లాక్ అండ్ లేత గోధుమరంగు డ్యూయల్ టోన్ ఇంటీరియర్
- ఫాబ్రిక్ సీటు అప్హోల్స్టరీ
- అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్ హెడ్రెస్ట్
- MID (మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే)తో కూడిన అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
- నాలుగు పవర్ విండోస్
- ఆటో అప్/డౌన్ ఫర్ డ్రైవర్ సైడ్ విండో
- కీలెస్ ఎంట్రీ
- మాన్యువల్ AC
- టిల్ట్-అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్
- ఆరు ఎయిర్‌బ్యాగులు
- రియర్ డీఫాగర్
- అన్ని సీట్లకు రిమైండర్‌తో 3-పాయింట్ సీట్ బెల్ట్
- ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP)
- హిల్-హోల్డ్ అసిస్ట్
- EBDతో ABS
- రివర్స్ పార్కింగ్ సెన్సార్
- ధర: రూ. 6.79 లక్షలు
2. 2024 Maruti Dzire VXi:
- పవర్‌ట్రెయిన్: పెట్రోల్-MT, పెట్రోల్-AMT, CNG-MT
- కవర్లతో కూడిన 14-అంగుళాల స్టీల్ వీల్స్
- ఫ్రంట్ గ్రిల్‌పై క్రోమ్ ఫినిష్
- వింగ్ మిర్రర్‌పై టర్న్ ఇండికేటర్
- బాడీ-కలర్ డోర్ హ్యాండిల్స్ అండ్ వింగ్ మిర్రర్స్
- ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ వింగ్ మిర్రర్స్
- డాష్‌బోర్డ్‌పై సిల్వర్ ఇన్సర్ట్
- 7-అంగుళాల టచ్‌స్క్రీన్
- వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్‌ప్లే
- 4-స్పీకర్స్
- స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్
- OTA అప్డేట్
- వాయిస్ అసిస్టెంట్
- USB అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ
- హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్
- అడ్జస్టబుల్ రియర్ హెడ్రెస్ట్
- డే/నైట్ ఇన్‌సైడ్ రియర్‌వ్యూ మిర్రర్ (IRVM)
- ఫ్రంట్ రూఫ్ ల్యాంప్
- రియర్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్ విత్ కప్‌హోల్డర్
- రియర్ AC వెంట్స్
- ధర: రూ. 7.79 లక్షలు - 8.74 లక్షలు
3. 2024 Maruti Dzire ZXi:
- పవర్‌ట్రెయిన్: పెట్రోల్-MT, పెట్రోల్-AMT, CNG-MT
- ఆటో LED హెడ్‌లైట్స్
- LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్
- 15-అంగుళాల సింగిల్-టోన్ అల్లాయ్ వీల్స్
- క్రోమ్ విండో గార్నిష్
- డాష్‌బోర్డ్‌లో సిల్వర్ ట్రిమ్ అండ్ ఫాక్స్ ఉడ్ ఇన్‌సర్ట్‌లు
- పుష్ బటన్ స్టార్ట్/స్టాప్
- వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్
- కీ-ఆపరేటెడ్ బూట్ ఓపెనింగ్
- ఆటో AC
- 6 స్పీకర్లు (2 ట్వీటర్‌లతో సహా)
- కనెక్టెడ్ కార్ టెక్నాలజీ
- రివర్స్ పార్కింగ్ కెమెరా
- టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS)
- ధర: రూ. 8.89 లక్షలు - 7.84 లక్షలు
2024 Maruti Dzire ZXi+:
- పవర్‌ట్రెయిన్: పెట్రోల్-MT, పెట్రోల్-AMT
- 15-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్
- LED ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్
- ఫ్రంట్ ఫుట్‌వెల్ లైట్
- లెథర్‌తో చుట్టిన స్టీరింగ్ వీల్
- 9-అంగుళాల టచ్‌స్క్రీన్
- అర్కామిస్-ట్యూన్డ్ సౌండ్ సిస్టమ్
- సింగిల్ పేన్ సన్‌రూఫ్
- ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌లో కలర్ MID
- క్రూయిజ్ కంట్రోల్
- కారు లాక్ చేసేటప్పుడు ఆటో ఫోల్డ్ వింగ్ మిర్రర్స్
- 360-డిగ్రీ కెమెరా
- ధర: రూ. 9.69 లక్షలు - రూ. 10.14 లక్షలు
మారుతి సుజుకి ఈ కొత్త డిజైర్‌ను రిలీజ్ చేసినప్పటి నుంచే ప్రీ బుకింగ్స్ ప్రారంభించింది. కేవలం 11,000 అడ్వాన్స్ చెల్లించి కంపెనీ వెబ్‌సైట్ లేదా అధికారిక డీలర్‌షిప్ నుంచి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ధరలు కంపెనీ స్టార్టింగ్ ప్రైజెస్. ఇవి డిసెంబర్ 31 వరకు మాత్రమే వర్తిస్తాయి.
వీటికి పోటీ: ఇండియాలో ఈ కొత్త మారుతి డిజైర్.. హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్, హోండా అమేజ్‌లకు పోటీగా ఉంది.
నేడే హాట్‌స్టార్‌లో జియో సినిమా విలీనం- కొత్త డొమైన్ ఇదేనా?
మీరు యాపిల్ డివైజస్ వాడుతున్నారా?- అయితే కేంద్రం హైరిస్క్ అలర్ట్- వెంటనే ఇలా చేయండి!