ETV Bharat / entertainment

OTT లవర్స్​కు హీరో రానా అదిరే సర్​ప్రైజ్​ - ఏంటో తెలుసా? - RANA DAGGUBATI TALK SHOW

ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పిన హీరో రానా దగ్గుబాటి - ఏం చెప్పారంటే?

Rana Daggubati Talk Show
Rana Daggubati Talk Show (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 13, 2024, 3:16 PM IST

Rana Daggubati Talk Show : వెండితెర వేదిక గానే కాకుండా ఓటీటీలోనూ వినోదాన్ని పంచుతుంటారు దగ్గుబాటి రానా. టాలీవుడ్ విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇప్పటికే రానా నాయుడు సిరీస్​తో ఓటీటీలో మంచి విజయాన్ని అందుకున్నారు. తాజాగా హోస్ట్‌గా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్​ ఫామ్ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన విశేషాలను అమెజాన్ ఓటీటీ సంస్థ తాజాగా అఫీషియల్​గా ప్రకటించింది.

The Rana Daggubati Show Streaming Date : 'ది రానా దగ్గుబాటి షో' అనే పేరుతో ఈ షో ప్రసారం కానుంది. నవంబర్‌ 23 నుంచి ఇది స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలిపింది అమెజాన్. ఇది కేవలం టాక్‌ షో మాత్రమే కాదని, అంతకు మించిన సరదా సంభాషణలతో సాగుతుందని వెల్లడించింది. ఇక ఈ విషయం బయటకు రాగానే రానా ఫ్యాన్స్​ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, దగ్గుబాటి రానా వ్యాఖ్యాతగా వ్యవహరించడం ఇదేమీ తొలి సారి కాదు. గతంలో ఆయన నెం.1యారి అనే టాక్‌ షోకు హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ టాక్​ షో మంచి ఆదరణను దక్కించుకుంది. టాలీవుడ్‌కు చెందిన చాలా మంది నటీ నటులు ఈ టాక్ షో కార్యక్రమంలో పాల్గొని, తమ సినిమా సంగతులతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సరదా విషయాలు కూడా చెప్పారు.

దీంతో ఇప్పుడు త్వరలో రానున్న ది రానా దగ్గుబాటి షోపై కూడా సినీ ప్రియుల్లో మంచి ఆసక్తి ఏర్పడింది. ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొననున్నారు? ఎలాంటి విశేషాలు చెబుతారు? అనే విషయాలు తెలుసుకునేందుకు వారంతా ఆసక్తి చూపిస్తున్నారు.

Rana Daggubati Upcoming Movies : ఇక రానా సినిమాల విషయానికొస్తే ఆయన చివరిసారిగా రజనీ కాంత్ నటించిన వేట్టాయన్ చిత్రంలో కనిపించి మెప్పించారు. ప్రస్తుతం జై హనుమాన్​లో నటిస్తారనే కొత్త ప్రచారం మొదలైంది. తాజాగా ఆయనతో కలిసి దిగిన ఫొటోను దర్శకుడు ప్రశాంత్ షేర్ చేశారు.

'హ్యారీపోటర్‌'లా ప్రభాస్‌ సినిమా - ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత

సల్మాన్ ఖాన్​ బెదిరింపుల కేసు - 24 ఏళ్ల సాంగ్ రైటర్​ అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.