ఈనాడు క్రికెట్ లీగ్ పోటీలు మేడ్చల్ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో హోరాహోరీగా కొనసాగుతున్నాయి. సీనియర్ విభాగంలో రెండు మ్యాచ్లు జరిగాయి. తెలంగాణ టైగర్స్, హైదరాబాద్ హీరోస్ తలపడగా హైదరాబాద్ హీరోస్ గెలుపొందింది. సెంట్రల్ ఆంధ్ర, నార్త్ ఆంధ్ర టీమ్ లు ఆడిన మ్యాచ్లో సెంట్రల్ ఆంధ్ర టీమ్ విజయం సాధించింది.
జూనియర్ విభాగంలో రెండు మ్యాచ్లు జరిగాయి. తెలంగాణ టైగర్స్, హైదరాబాద్ హీరోస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ హీరోస్ విజయబావుటా ఎగరవేసింది. సెంట్రల్ ఆంధ్ర, నార్త్ ఆంధ్ర టీమ్లు తలపడగా నార్త్ ఆంధ్ర టీమ్ గెలిచింది.
ఇవీ చూడండి : 'పటిష్ఠమైన అట్రాసిటీ చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత భాజపాదే'