మేడ్చల్ జిల్లా నాచారం డివిజన్ భాజపా అభ్యర్థి అనిత రెడ్డికి మద్దతుగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రచారం చేశారు. ఫామ్ హౌస్‌లో ఉండే కేసీఆర్ భాజపాపై యుద్ధం ప్రకటించడం హాస్యాస్పదం అని నాచారం డివిజన్‌లో నిర్వహించిన రోడ్‌షోలో అన్నారు. కేంద్రం నిధులు ఇవ్వకపోతే జాతీయ రహదారులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. తెరాసలాగా భాజపా టికెట్లు అమ్ముకోలేదని ఆరోపించారు.
హైదరాబాద్‌లో వరదలు వస్తే కేసీఆర్ ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ప్రజల కన్నీటిలో తెరాస కొట్టుకుపోతుందని... తెరాస, ఎంఐఎం రెండూ ఒకటేనని విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధి భాజపాతోనే సాధ్యమని అన్నారు. కమలం గుర్తుకే అమూల్యమైన ఓట్లు వేసి... భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఇదీ చదవండి: ఐసీఏఆర్ పరీక్షలో జయశంకర్ విశ్వవిద్యాలయ ప్రభంజనం