లాక్ డౌన్ కారణంగా కూలీలు ఆకలితో ఉండకూడదని.. గత 50 రోజుల నుంచి మల్కాజిగిరి నియోజకవర్గంలో నిత్యావసర సరకులను మైనంపల్లి ట్రస్ట్ నిర్వాహకులు పంపిణీ చేస్తున్నారు.
మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి మున్సిపల్ పరిధిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు అందించారు. ఆకలితో ఉన్న వారు.. ఒక్క ఫోన్ చేస్తే చాలు వారి ఆకలి తీరుస్తామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: హిమాయత్ సాగర్ వద్ద చిరుత ఆచూకీ