ఇటీవల జంట నగరాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు నీటమునిగాయి. సికింద్రాబాద్లోని పలు లోతట్టు ప్రాంతాల్లో పేద ప్రజల ఇళ్లలోకి నీరు చేరి.. సామగ్రి పూర్తిగా తడిసిపోయింది. వరదతో నష్టపోయిన పేదలకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, మల్కాజిగిరి పార్లమెంట్ తెరాస ఇంఛార్జ్ రాజశేఖర్ రెడ్డి సాయమందించారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆరో వార్డులోని పలు బస్తీల్లో నిత్యావసర సరుకులు, దుప్పట్లను కేసీఆర్ రేషన్ కిట్ల పేరుతో అందజేసినట్లు ఆరో వార్డు సభ్యులు పాండు యాదవ్ తెలిపారు. వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకుంటామని, ఆర్థిక సాాయం అందని వారికి కూడా అందజేసే విధంగా కృషి చేస్తామని ఆయన అన్నారు. దీనిపై స్థానికులు, బస్తీవాసులు హర్షం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: వరద బాధితుల ఇళ్ల వద్దకే వెళ్లి సాయం అందిస్తాం: మంత్రి తలసాని