మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లోని పలు ప్రాంతాలలో మట్టి వినాయక విగ్రహాలను ఫెస్టివ్ ఫోక్స్ ఆర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ ఉచితంగా పంపిణీ చేసింది. రసాయన పదార్థాలతో చేసే వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల చెరువులు, కాలువలు కలుషితం అవుతున్నాయని ఫెస్టివ్ ఫోక్స్ ఛైర్ పర్సన్ ఉమ ఎడ్లపాటి పేర్కొన్నారు. మట్టి గణపతులను ప్రతిష్ఠించి శ్రద్ధతో పూజలు నిర్వహిస్తే ముక్తి మార్గం లభిస్తుందని అన్నారు.
ఇదీ చూడండి : పర్యావరణ హితం.. " ఒక ఊరు... ఒక గణపతి"