ETV Bharat / state

స్నేహితుల వద్దకు వెళ్లొస్తానని చెప్పి.. అనంతలోకాలకు - ఘట్​కేసర్​లో డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

స్నేహితుల వద్దకు వెళ్లొస్తానని చెప్పి ఇంటి నుంచి బయలు దేరిన కుమారుడు తెల్లవారేసరికి శవమై కనిపించాడు. చేతికందొచ్చిన కొడుకు నిర్జీవంగా పడి ఉండటం చూసిన ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.

degree student suicide at ghatkesar in medchal district
స్నేహితుల వద్దకు వెళ్లొస్తానని చెప్పి..
author img

By

Published : Mar 16, 2020, 11:35 AM IST

స్నేహితుల వద్దకు వెళ్లొస్తానని చెప్పి..

మేడ్చల్​ జిల్లా ఘట్​కేసర్​ పీఎస్​ పరిధిలోని అవుషాపూర్​లో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్న శైలేశ్​ నిన్న రాత్రి 11.30 గంటల సమయంలో స్నేహితుల వద్దకు వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు.

ఉదయమైనా తిరిగి రాకపోయేసరికి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. ఓ వైపు పోలీసులు, మరో వైపు కుటుంబ సభ్యులు ఆ యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు తమ ఇంటి సమీపంలోని ఓ నీళ్ల ట్యాంక్​ వద్ద పడి చనిపోయినట్లు గుర్తించారు.

ట్యాంక్​పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని తెలిపారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.