ETV Bharat / state

ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి: సీపీ సజ్జనార్ - Cp visit kukatpally polling center

హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్​నగర్ పట్టభద్రుల ఎన్నికల పోలింగ్​లో భాగంగా కూకట్​పల్లి జిల్లా పరిషత్ పాఠశాల పోలింగ్ కేంద్రాన్ని సైబరాబాద్​ సీపీ సజ్జనార్ తనిఖీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి: సీపీ సజ్జనార్

author img

By

Published : Mar 14, 2021, 1:13 PM IST

ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్క పట్టభద్రుడు తమ బాధ్యతను నిర్వర్తించాలని సైబరాబాద్​ సీపీ సజ్జనార్ అన్నారు. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్​నగర్ పట్టభద్రుల ఎన్నికల పోలింగ్​లో భాగంగా కూకట్​పల్లి జిల్లా పరిషత్ పాఠశాల పోలింగ్ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు.

ఓటు వేయడానికి వచ్చిన సీనియర్ సిటిజన్స్​కి కుర్చీలు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. పట్టభద్రులు ఓటు వేసి ప్రజాస్వామ్యని గెలిపించాలని కోరారు. గత ఎన్నికల్లో 34 శాతం మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారని... ఈసారి ఓటింగ్ శాతం పెరగాలన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఓటింగ్​ సరళిపై సైబరాబాద్ సీపీ సజ్జనార్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి.

ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి: సీపీ సజ్జనార్

ఇదీ చూడండి: కేసీఆర్ పోటీ చేసినా ఓటమి తప్పదు: చిన్నారెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.