మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో నిందితుల నాలుగు రోజుల కస్టడీ ముగిసింది. అనంతరం నిందితులని న్యాయస్థానంలో హాజరుపరచగా.. 14 రోజుల రిమాండ్ విధించింది. నాలుగు రోజుల కస్టడీలో నిందితుల నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో పేట్ బషీరాబాద్ పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రిని హత్య ఎందుకు చేయాలనుకున్నారు? తుపాకులు ఎవరు సమకూర్చారు..? వారికి రూ.15 కోట్ల సుపారి నగదు ఎవరిచ్చారు? అనే కోణాల్లో పోలీసులు విచారించారు.
విచారణ వీడియో తీయాలని కోర్టు ఆదేశం
కస్టడీలో భాగంగా విచారణ సమయంలో నిందితులపై థర్డ్ డిగ్రీ ఉపయోగించొద్దని, విచారణ మొత్తం వీడియోగ్రఫీ చేయాలని కోర్టు ఆదేశించింది. అడ్వకేట్ సమక్షంలో నిందితులను విచారించాలని కోర్టు ఆదేశించడంతో విచారణ సమయంలో నిందితుల నుంచి ఎలాంటి సమాధానాలు రాలేదని సమాచారం.
ఇదీ చూడండి: