ETV Bharat / state

గ్రేటర్ శివారులో వారానికి మూడు సార్లే కరోనా పరీక్షలు

author img

By

Published : Aug 5, 2020, 8:37 AM IST

మేడ్చల్‌ జిల్లా పరిధిలో క్షేత్రస్థాయిలో వారంలో మూడు రోజులు మాత్రమే కరోనా పరీక్షలు చేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు గర్భిణులు, బాలింతలకు వైద్య పరీక్షలు, చిన్నారులకు టీకాలు వేయించుకునేందుకు వారు వచ్చే రోజుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం లేదని వైద్యాధికారులు ప్రకటిస్తున్నారు.

less number of corona tests in hyderabad outskirt districts
గ్రేటర్ శివారులో వారానికి మూడు సార్లే కరోనా పరీక్షలు

మేడ్చల్‌ జిల్లా పరిధిలో జీహెచ్‌ఎంసీతోపాటు గ్రామీణ పరిధిలో 79 కేంద్రాల్లో పరీక్షలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో అన్ని కేంద్రాల్లోనూ నిత్యం పరీక్షలు జరగడం లేదు. వారంలో మూడు రోజులు మాత్రమే కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఘట్‌కేసర్‌, నారాపల్లి, శామీర్‌పేట, కీసర, మేడ్చల్‌ ప్రాథమిక, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో నిత్యం పరీక్షలు చేయించుకునేందుకు పెద్దసంఖ్యలో బాధితులు వస్తున్నారు. మేడ్చల్‌లో పరీక్షల కోసం 150 మంది వరకు వస్తున్నట్లు అంచనా. అయినప్పటికీ ఆయా ప్రాంతాల్లోని పీహెచ్‌సీల్లో మంగళవారం, గురువారం, శనివారం మాత్రమే పరీక్షలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని పీహెచ్‌సీల్లోనూ పరిమిత సంఖ్యలో టెస్టులు చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు.

వారంలో మూడు రోజులు గర్భిణులు, బాలింతలకు వైద్య పరీక్షలు, చిన్నారులకు టీకాలు వేస్తున్నారు. వీరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోజుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం లేదని వైద్యాధికారులు ప్రకటిస్తున్నారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలోనే అత్యధికంగా నగర శివారు ప్రాంతాల్లో ఎక్కువ పాజిటివ్‌ కేసులు వెలుగుచూస్తున్న పరిస్థితి. ఇలాంటి సమయంలో ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసి ప్రతిరోజూ పరీక్షలు చేసే విషయంపై దృష్టి పెట్టాల్సి ఉంది. అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా మూడు రోజులే పరీక్షలు చేసి సరిపుచ్చుతున్నారు.

శివారు గ్రామాల్లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. కేసులు పెద్దసంఖ్యలో వెలుగు చూస్తున్నాయి. అయినప్పటికీ పరీక్షలు చేసే విషయంలో అధికారులు వెనకడుగు వేస్తున్నారు. నగర శివారుల్లో వారంలో మూడు రోజులు మాత్రమే కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. అది కూడా పరిమిత సమయంలోపే చేయడంతో ఆ తర్వాత ఎవరైనా వస్తే రెండు రోజులు ఎదురు చూడాల్సి వస్తోంది.

ఉదయం 9 నుంచి 12 వరకే..వైద్యసిబ్బందికేదీ రక్షణ..!

పరీక్షలు చేసే రోజున ఉదయం 9లోపు వచ్చి క్యూలైన్‌లో ఉండాలి. లేదంటే రెండు రోజులు వేచి ఉండాల్సిందే. పరీక్షలు కూడా పరిమిత సంఖ్యలో చేస్తున్నారని వాపోతున్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత వచ్చిన బాధితులను రెండు రోజుల తర్వాత రావాలని సూచిస్తున్నారు. లేకపోతే మరుసటి రోజే పరీక్ష చేయించుకోవాలంటే మల్కాజిగిరిలోని జిల్లా ఆసుపత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు. దీనివల్ల మధ్యాహ్నం 12 తర్వాత వచ్చిన వారు దిక్కులేక వెనుదిరగాల్సి వస్తోంది.

అసలే అంతంతమాత్రంగా పరీక్షలు చేస్తుండగా.. అదే సమయంలో పరీక్షలు చేసే టెక్నీషియన్స్‌కు రక్షణ లేకుండాపోతోంది. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలంటే పీపీఈ కిట్లు ధరించి కళ్లద్దాలు, చేతికి గ్లౌజులు వేసుకోవాలి. తర్వాత టెక్నీషియన్‌కు, బాధితుడికి మధ్య ప్రత్యేక గ్లాస్‌ ఛాంబర్‌ వంటి రక్షణ కవచం ఉండాలి. కానీ పీహెచ్‌సీల్లో ఎక్కడా ఈ తరహా ఏర్పాట్లు లేవు. వైద్య సిబ్బంది కేవలం పీపీఈ కిట్లు ధరించి బాధితుల నుంచి నేరుగా శాంపిల్స్‌ తీసుకుంటున్నారు. పాజిటివ్‌ కేసులు పెద్దఎత్తున నమోదవుతున్న తరుణంలో నేరుగా శాంపిల్స్‌ తీసుకోవడం వల్ల వైద్య సిబ్బంది కరోనా బారిన పడే ప్రమాదం ఉందని వాపోతున్నారు.

ఇదీ చదవండి: ఆన్​లైన్​లో అందుకు ఆసక్తి చూపారో... ఇక అంతే సంగతి!

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.