ETV Bharat / state

మేడ్చల్​ జిల్లాలో కరోనా కలకలం.. భయపడుతున్న ప్రజలు!

కరోనా పాజిటివ్ కేసుల కారణంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వాసులు ఆందోళనకు గురవుతున్నారు. బోడుప్పల్ నగర పాలక సంస్థ తెరాస అధ్యక్షుడు చర్ల ఆంజనేయులు కొవిడ్​ పాజిటివ్​తో ‌ఓ‌ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఉప్పల్ సర్కిల్ పరిధిలోని ఉప్పల్, రామంతపూర్​లో కూడా ఐదు పాజిటివ్​ కేసులు నమోదు కావడం వల్ల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Corona Cases Increased in Medchal District
మేడ్చల్​ జిల్లాలో కరోనా కలకలం.. భయపడుతున్న ప్రజలు!
author img

By

Published : Aug 3, 2020, 9:25 PM IST

రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్​ కేసులతో మేడ్చల్​ మల్కాజ్​గిరి జిల్లా వాసులు ఆందోళనకు చెందుతున్నారు. ఇప్పటికే బోడుప్పల్​ నగరపాలక సంస్థ తెరాస అధ్యక్షుడు చర్ల అంజనేయులు పాజిటివ్​ సోకి మరణించారు. తాజాగా ఉప్పల్​ సర్కిల్​ పరిధిలో ఐదు కేసులు నమోదయ్యాయి. వీరిలో రామంతపూర్ నెహ్రూ నగర్​లో గతంలో కరోనా వైరస్ సోకిన కుటుంబంలోనే మరో ఇద్దరు చిన్నారులు కరోనా బారిన పడ్డారు. వీరితో పాటు పాత రామంతపూర్​లో ఒకరు, ఉప్పల్ భరత్ నగర్​లో ఇద్దరికి కరోనా వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు.

ఒక్క సోమవారం నాడే ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 26 మందికి రాపిడ్ పరీక్షలు నిర్వహించగా వీరిలో ఏడుగురికి పాజిటివ్​గా తేలింది. కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. జీహెచ్ఎంసీ, పంచాయతీ సిబ్బంది ఎప్పటికప్పుడు సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారి చేస్తున్నారు.

ఇదీ చూడండి : పీఎస్​కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.