ETV Bharat / state

Revanth Reddy: 'మనం కొట్టుకోవడం కాదు.. తెరాస, భాజపాలపై మన ప్రతాపాన్ని చూపిద్దాం' - congress political training started at kompally

పార్టీలో ఒకరిపైఒకరు ప్రతాపం చూపించడం కాకుండా.. కలిసికట్టుగా ఉండి ఆ ప్రతాపాన్ని తోడు దొంగలైన తెరాస-భాజపాలపై చూపించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(TPCC chief Revanth Reddy) కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు సూచించారు. పార్టీ పటిష్ఠానికి కృషి చేస్తూ.. ప్రజాసమస్యలపై పోరాడదామని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో సోనియమ్మ రాజ్యం తీసుకొచ్చి.. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం అందిద్దామని అన్నారు.

Revanth Reddy
Revanth Reddy
author img

By

Published : Nov 9, 2021, 12:45 PM IST

Updated : Nov 9, 2021, 3:22 PM IST

తెరాస,భాజపాలపై మన ప్రతాపాన్ని చూపిద్దాం

మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని కన్వెన్షన్ సెంటర్​లో కాంగ్రెస్ రాజకీయ శిక్షణ తరగతులు(Congress Party Political training classes) ప్రారంభమయ్యాయి. పార్టీ జెండాను ఆవిష్కరించి.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(TPCC chief Revanth Reddy) శిక్షణా తరగతులను ప్రారంభించారు. ఇవాళ, రేపు ఈ తరగతులు కొనసాగనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. పార్టీ జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, బ్లాక్ కమిటీ అధ్యక్షులకు శిక్షణ ఇస్తున్నట్లు రేవంత్(TPCC chief Revanth Reddy) చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 9 నుంచి 10 మంది శిక్షణకు హాజరయ్యారు. నియోజకవర్గాల వారీగా వారి కోసం ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేశారు.

రసాభాస

కార్యక్రమం ప్రారంభంలోనే (Congress Party Political training classes) రసాభాస జరిగింది. రేవంత్ రెడ్డి(TPCC chief Revanth Reddy) ప్రసంగిస్తుండగా.. జనగామ జిల్లా నేతలు ఆందోళన చేశారు. జిల్లాలో ఇన్​ఛార్జుల నియామకంపై వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్​కుమార్ గౌడ్​ను నిలదీశారు. ఆ నేతలకు సర్దిచెప్పిన రేవంత్.. మధ్యాహ్న భోజన సమయంలో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి సమస్యలు ఏవైనా ఉంటే.. సీనియర్ నేతలను సంప్రదించి పరిష్కరించుకోవాలని.. అంతేగానీ క్రమశిక్షణ మరిచి ఇతరులు బురదజల్లేలా చేసుకోవద్దని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే పార్టీలో క్రమశిక్షణారాహిత్యం కింద చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

"కాంగ్రెస్ కార్యకర్తలంతా గల్లీలో కష్టపడితే.. దిల్లీలో మన పార్టీ అధికారంలోకి వస్తుంది. 131 కోట్ల ప్రజల ఆకాంక్షలను తీరుస్తుంది. మీరు కష్టపడితేనే సోనియమ్మ రాజ్యం వచ్చి తెలంగాణ ప్రజలకు నియంత పాలన నుంచి విముక్తి లభిస్తుంది. ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టాలో ఈ కార్యక్రమం ద్వారా చర్చిద్దాం. రాహుల్ గాంధీ నాయకత్వంలో.. దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరుగుతోంది. 34,706 పోలింగ్ బూత్​లలో ప్రతి బూత్​కు ఓ ఎన్​రోలర్​ ఉంటాడు. ఆ వ్యక్తి తన వద్ద ఉన్న ఫోన్​లో కాంగ్రెస్ యాప్ డౌన్​లోడ్ చేసుకుని.. ఆ ప్రాంతంలో ఉన్న ఓటర్లను మన పార్టీలో చేరేలా ప్రోత్సహించి వారి పేర్లను యాప్​లో నమోదు చేస్తాడు."

- రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

కలిసికట్టుగా ఉందాం..

పార్టీలో ఒకరిపై మరొకరు తమ ప్రతాపం చూపించడం కాకుండా.. అందరం కలిసికట్టుగా ఉండి ఆ ప్రతాపాన్ని తోడుదొంగలైన తెరాస-భాజపాలపై చూపించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(TPCC chief Revanth Reddy) అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి ఇంధన ధరలు ధరలు తగ్గించేలా కృషి చేయాలని అన్నారు. రాష్ట్రంలో యాసంగి పంటపై ఆందోళన చెందుతున్న రైతులకు అండగా నిలిచి వారికి అన్యాయం జరగకుండా చేద్దామని కార్యకర్తలకు చెప్పారు. ఓవైపు పార్టీ పటిష్ఠానికి కృషి చేస్తూనే... మరోవైపు ప్రజాసమస్యలపై పోరాడదామని పిలుపునిచ్చారు. ఆ రెండింటిని సమన్వయం చేస్తూ సోనియమ్మ రాజ్యం వచ్చేలా కృషి చేద్దామన్నారు.

ఏ రాజకీయ పార్టీకైనా క్రియాశీలక నిర్మాణం ముఖ్యమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు. వ్యక్తులు నాయకులు వస్తుంటారు.. పోతుంటారు కానీ.. కార్యకర్తలే పార్టీకి పునాదులని పేర్కొన్నారు. దేశంలోని అన్ని వర్గాలను ఏకం చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్​ అని అభివర్ణించారు. రిజర్వేషన్లు తీసుకువచ్చిన ఘనత హస్తానికే దక్కుతుందని తెలిపారు. గాంధీయిజమే కాంగ్రెస్ భావజాలమని స్పష్టం చేశారు.

"కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా.. ఎన్ని హింసలు పెట్టినా పార్టీ జెండాను మోస్తున్న ఘనత కార్యకర్తలది. ప్రధాని అయ్యే అవకాశం సోనియాకు వచ్చినా పార్టీ కోసం త్యాగం చేసిన గొప్ప నేత. ప్రస్తుతం దేశం మతోన్మాద శక్తుల చేతుల్లో ఉంది. భారత్​ను కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉంది. దేశాన్ని నాశనం చేస్తున్న భాజపా .. రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్న తెరాసలను ఓడించాలి. కలిసికట్టు పనిచేస్తే ఆ లక్ష్యాన్ని మనం సులభంగా సాధించవచ్చు."

- భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

దేశంలో 30% ఉన్న మైనార్టీలను భాజపా గాలికి వదిలేసిందని ఎంపీ ఉత్తమ్​కుమార్ రెడ్డి మండిపడ్డారు. ప్రాంతీయపార్టీల ఏకైక సిద్ధాంతం అవకాశవాదమని అన్నారు. తెరాస సిద్ధాంతం దాచుకోవడం.. దోచుకోవడమేనని ఆరోపించారు. ఒక్క సంతకంతో దేశంలో రైతుల రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్​దని గుర్తుచేశారు. భాజపా అధికారంలోకి వచ్చాక మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు పడ్డాయని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి : Minister KTR: కార్పొరేట్‌ను తలదన్నేలా బీబీపేట్​ జడ్పీ పాఠశాల.. ప్రారంభించిన కేటీఆర్

Last Updated : Nov 9, 2021, 3:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.