ETV Bharat / state

కూకట్​పల్లి తహసీల్దార్​ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతల నిరసన - మేడ్చల్​ జిల్లా తాజా వార్తలు

జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామన్న కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపుమేరకు కూకట్​పల్లిలోని తహసీల్దార్​ కార్యాలయం ఎదుట పలువురు కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. అనంతరం తహసీల్దార్​కు వినతి పత్రం అందజేశారు.

Congress leaders protest in front of Kookat Palli tehsildar's office
కూకట్​పల్లి తహసీల్దార్​ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతల నిరసన
author img

By

Published : Aug 28, 2020, 2:59 PM IST

విద్యార్థులకు జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామన్న కేంద్ర నిర్ణయాన్ని నేషనల్ కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ఈ మేరకు నేడు దేశ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కూకట్​పల్లిలో పలువురు కాంగ్రెస్ నేతలు స్థానిక తహసీల్దార్​ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అనంతరం తహసీల్దర్​కు వినతి పత్రం అందజేశారు.

కరోనాతో ఓ వైపు దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే.. వారిని రక్షించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని నేతలు ఆరోపించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదని మండిపడ్డారు. జేఈఈ, నీట్ పరీక్షలు నిర్వహించాలని మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు వెంగల్​ రావు, గాలి బాలాజీ, గంధం రాజు, సుభాష్, యూత్ కాంగ్రెస్ నాయకులు మొయిజ్, ఆసీఫ్ తదితరులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.