గ్రేటర్ ఎన్నికల్లో ఓటర్లకు తెరాస అభ్యర్థులు డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ భాజపా కార్యకర్తలు ఆరోపించారు. రామంతాపూర్ డివిజన్లో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనుచరులు.. డివిజన్ పరిధిలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారని భారీగా భాజపా కార్యకర్తలు తరలివెళ్లారు. అక్కడ ఇరువర్గాల మధ్య వాగ్వాదం పెరగడంతో ఘర్షణకు దారి తీసింది. విషయం తెలుసుకున్న ఉప్పల్ పోలీసులు.. ఇరువర్గాల వారీని ఠాణాకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: మున్నూరు కాపుల సమస్యల్ని పరిష్కరిస్తాం: కేటీఆర్