మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో వరద బాధితులు మెదక్ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. దీనివల్ల రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను పంపించే ప్రయత్నం చేశారు.
ఉప్పల్ జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు బాధితులు ఆందోళన చేపట్టారు. అధికార పార్టీకి చెందిన వారికే డబ్బులు ఇస్తున్నారని... అసలైన బాధితులకు సాయం అందడంలేదని వాపోయారు. పెద్ద ఎత్తున బాధితులు కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళన చేస్తున్నవారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. సాయం అందించడంలోనూ వివక్ష చూపుతున్నారని బాధితులు మండిపడ్డారు.
ఇవీచూడండి: వరద సాయం కోసం నగరంలో పలుచోట్ల బాధితుల ఆందోళన