మేడ్చల్ జిల్లా నిజాంపేట్‌లో మున్సిపల్ నామినేషన్ ప్రక్రియ కార్యాలయాన్ని కలెక్టర్ ఎం.వి.రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డు కార్యాలయాల్లో నామినేషన్ దరఖాస్తు ఏవిధంగా పొందు పరచాలి, ఎలా పూర్తి చేశారు అనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెల్ప్‌డెస్క్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరిశీలన అధికారి ఎల్లప్పుడు పరిశీలిస్తారని కలెక్టర్ తెలిపారు.
ఇదీ చూడండి: 'హైదరాబాద్ విషయంలో అలాంటి ప్రతిపాదనే లేదు'