మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక కార్యక్రమం నిర్వహించారు. అధికార పార్టీకి చెందిన ఐదుగురు సభ్యులు ఎన్నికయ్యారు.
గత జనవరిలో కార్పొరేషన్‌కు మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరగగా.. తెరాస నుంచి 27 మంది కార్పొరేటర్లు ఎన్నికయ్యారు. మరో ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచారు. ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ గోపాల్ రెడ్డి అధ్యక్షతన కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిజాంపేట నుంచి అభిషేక్ రెడ్డి, తలారి వీరేష్, బాచుపల్లి నుంచి సయ్యద్ అలీ, మాజీ ఉప సర్పంచ్, ఎన్. వాణి, సి.హెచ్.జ్యోతిలు ఎంపికైనట్లు మేయర్ గోపాల్‌రెడ్డి ప్రకటించారు.