మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవేందర్‌నగర్‌లో ఘోర పేలుడు సంభవించింది. రసాయన డ్రమ్ పేలి ఖయ్యూమ్ (40), ముని బేగం అనే ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఖయ్యూమ్ పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఖయ్యూమ్కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి: వేతనం మినహాయించుకునే అధికారం ఆర్టీసీకి ఉంది: అదనపు ఏజీ