రైల్వే కేటాయింపులు రాష్ట్రాల పరిధిలో ఉండవని, జోనల్ పరిధిలో ఉంటాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. రాష్ట్రాలు సహకరిస్తేనే రైల్వే లైన్లు వేగంగా పూర్తవుతాయని తెలిపారు.
మేడ్చల్ జిల్లా చర్లపల్లిలో శాటిలైట్ రైల్వే స్టేషన్ నిర్మాణానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శంకుస్థాపన చేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 427 రైల్వే స్టేషన్లలో సికింద్రాబాద్ నుంచి రిమోట్ లింక్ ద్వారా ఉచిత వైఫై సేవలు ప్రారంభించారు. యర్రగుంట్ల-నంద్యాల సెక్షన్ విద్యుదీకరణకు భూమిపూజ చేశారు. గుంతకల్లు-కల్లూరు సెక్షన్ రెండో మార్గాన్ని జాతికి అంకితం చేశారు.
యూపీఏ హయాంలో రాష్ట్రానికి రూ. 258 కోట్లే కేటాయించారని మంత్రి అన్నారు. ఎన్టీఏ హయాంలో 2020-21లో రూ.2,602 కోట్లు కేటాయించారని తెలిపారు.
- ఇదీ చూడండి: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ