ETV Bharat / state

కేంద్రం సహాయం లేకుండా ఒక్క పథకం కూడా చేపట్టలేదు: కిషన్​ రెడ్డి - telangana varthalu

నిరుద్యోగ యువత, ఉద్యోగులు కేసీఆర్​ సర్కారు పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు లేకుండా ఒక్క పథకం కూడా తెరాస సర్కారు చేపట్టలేదని ఆయన ఆరోపించారు.

కేంద్రం సహాయం లేకుండా ఒక్క పథకం కూడా చేపట్టలేదు: కిషన్​ రెడ్డి

author img

By

Published : Mar 7, 2021, 7:37 PM IST

రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు లేకుండా ఒక్క పథకం కూడా తెరాస సర్కారు చేపట్టలేదని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి ఆరోపించారు. మేడ్చల్​ జిల్లా పీర్జాదిగూడలో భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్​ రావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టభద్రులు, భాజపా శ్రేణులతో కిషన్​ రెడ్డి సమావేశమయ్యారు.

నిరుద్యోగ యువత, ఉద్యోగులు కేసీఆర్​ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని కిషన్​ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించి తెరాస ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పట్టభద్రులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో భాజపా మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొంపల్లి మోహన్​ రెడ్డి, మేడ్చల్​ జిల్లా రూరల్​ అధ్యక్షుడు పటోళ్ల విక్రమ్​ రెడ్డి, భాజపా శ్రేణులు, పట్టభద్రులు పాల్గొన్నారు.

కేంద్రం సహాయం లేకుండా ఒక్క పథకం కూడా చేపట్టలేదు: కిషన్​ రెడ్డి

ఇదీ చదవండి: ఎవరు ఎవర్ని ఆదుకుంటున్నారో అర్థమవుతోంది: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.