పోలీసులపై ప్రజలకు పూర్తిస్థాయిలో నమ్మకం కలిగేలా ప్రస్తుత పోలీసు వ్యవస్థ పని చేస్తోందని మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పోలీసు ఇన్‌స్పెక్టర్ ఎన్.చంద్రబాబు అన్నారు. ఎన్‌ఎఫ్‌సీనగర్ కమ్యూనిటీహాల్‌లో జన హిత, రక్తదాన్, ఘట్‌కేసర్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది.
స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయపార్టీల నాయకులు, విద్యార్థులు, యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. 'రక్తదానం చేయండి ప్రాణ దాతలు కండి' అంటూ పెద్దలు చెప్పిన మాట అక్షరాలా పాటిస్తూ దాతలు ముందు రావడం అభినందనీయమన్నారు.
ప్రతి ఒక్కరూ రక్తదానం చేస్తే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడినవారమవుతామని ఎన్.చంద్రబాబు పేర్కొన్నారు. పోలీసు అమరుల త్యాగాలను స్మరించుకునేందుకు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దాతల నుంచి సేకరించిన 60 యూనిట్ల రక్తదానాన్ని కోఠిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అందజేసినట్లు చెప్పారు. ఘట్‌కేసర్‌కు చెందిన బొట్టు సూరి పోలీసులు ఏర్పాటు చేసిన శిబిరంలో రక్తదానం చేశారు. ఆయన రక్తదానం చేయడం 109వ సారి కావడంతో ప్రత్యేకంగా అభినందించారు. రక్తదానం చేసిన వారికి పోలీసులు ధ్రువపత్రాలు అందజేశారు.
ఇదీ చూడండి: Telangana Cabinet: ఎల్లుండి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం