ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం పురష్కరించుకొని మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లోని వీబీఐటీ కళాశాలలో సేవ సప్తాహ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాజపా జాతీయ కార్యదర్శి సునీల్ దేయోధర్ పాల్గొన్నారు. మహత్మా గాంధీ 150వ జయంతి నాటికి ప్లాస్టిక్ రహిత దేశంగా మార్చే బాధ్యత దేశ ప్రజలందరిపైన ఉందని ఆయన పేర్కొన్నారు. ప్లాస్టిక్ నివారణ కోసం తమవంతు కృషి చేస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
ఇదీ చూడండి: 'మళ్లీ పార్టీలో చేరడం మరపురాని సంఘటన'