Hi-tension at KPHB PS: సెల్లార్ గుంతలో పడి మృతి చెందిన ముగ్గురు బాలికల కుటుంబాలకు న్యాయంచేయాలంటూ... మేడ్చల్ జిల్లా కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ ఎదుట భాజపా నాయకులు ఆందోళనకు దిగారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ. 12 లక్షల చొప్పున పరిహారం, రెండు పడకల గదుల ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హోసింగ్ బోర్డు ఈఈ కిరణ్ బాబు దృష్టికి తీసుకెళ్లారు. ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో... మృతురాలు రమ్య తల్లిని అక్కడ నుంచి మరో పీఎస్‌కు తరలించారు.
బాధితుల డిమాండ్‌ను ఉన్నత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని కిరణ్ బాబు స్పష్టం చేశారు. సెల్లార్ గుంత తీసిన సదరు సంస్థపై కేసు నమోదు చేసి... వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు చేపడతామని కిరణ్ బాబు తెలియజేశారు. దీంతో గొడవ సద్దుమణిగింది.
ఇదీ చదవండి: కట్టెల పొయ్యి పెట్టి ఆట మొదలుపెట్టారు.. నీళ్ల కోసం వెళ్లిన ఆ ముగ్గురు చిన్నారులు..