ETV Bharat / state

ఎల్​ఆర్​ఎస్​ను రద్దు చేయాలంటూ భాజపా కార్యకర్తల నిరసన - telangana lrs scheme lastest news

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి మండల కార్యాలయం ఎదుట భాజపా నాయకులు నిరసనకు దిగారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్​ఆర్​ఎస్​ను రద్దు చేసి.. పేద ప్రజలకు వెంటనే రెండు పడక గదుల ఇళ్లను పంపిణీ చేయాలని డిమాండ్​ చేశారు.

bjp-leaders-protest-at-bachupally-mro-office-against-lrs-scheme
ఎల్​ఆర్​ఎస్​ను రద్దు చేయాలంటూ భాజపా కార్యకర్తల నిరసన
author img

By

Published : Sep 29, 2020, 4:59 PM IST

ఎల్ఆర్ఎస్​ను రద్దు చేసి వెంటనే పేద ప్రజలకు రెండు పడక గదుల ఇళ్లను పంపిణీ చేయాలని మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి మండల కార్యాలయం ఎదుట భాజపా నాయకులు నిరసనకు దిగారు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన రెండు పడక గదుల ఇళ్ల హామీని నెరవేర్చాలని డిమాండ్​ చేశారు.

రెండు పడక గదుల ఇళ్ల సమస్య తెరపైకి వస్తుందనే భయంతో ప్రజలను మభ్యపెట్టేందుకే తెరాస ప్రభుత్వం ఎల్ఆర్ఎస్​ను తీసుకువచ్చిందని భాజపా అధ్యక్షులు విక్రమ్​ రెడ్డి అన్నారు. ఎల్​ఆర్​ఎస్​ రద్దు చేసేంతవరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తామని విక్రమ్​రెడ్డి స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: రామప్ప దర్శనానికి 'భగీరథ' యత్నం చేయాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.