జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి చివరిరోజు కావడంతో అభ్యర్థులు సుడిగాలిలా పర్యటిస్తున్నారు. గ్రేటర్లో భాజపాకు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ కుషాయిగూడ మీర్పేట్ హౌసింగ్ బోర్డు అభ్యర్థి విజయలక్ష్మి కోరారు.
డివిజన్ పరిధిలో ఇంటింటికి వెళ్లి కమలం గుర్తుకే ఓటేయ్యాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. తెరాస పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. సమస్యలు పరిష్కారం కావాలంటే భాజపాను గెలిపించాలని విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు.