చర్లపల్లి డివిజన్‌కి మేయర్ బొంతు రామ్మోహన్ చేసిన అభివృద్ధి శూన్యమని చర్లపల్లి 3 వ డివిజన్ భాజపా అభ్యర్థి కాసుల సురేందర్ గౌడ్ ఆరోపించారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పర్చేవిధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా చర్లపల్లి 3వ డివిజన్లో ప్రచారం చేశారు.
వరద బాధితులకు, ముంపు ప్రాంత ప్రజలకు సరైన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తమకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వెల్లడించారు.
ఇదీ చదవండి: నేను చేసిన అభివృద్ధే గెలిపిస్తుంది: పద్మ నాయక్