మైనంపల్లి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పేద ప్రజలకు చేస్తున్న సేవలు ఎంతో గొప్పవని ప్రముఖ బాలీవుడ్ నటి భాగ్యశ్రీ, టాలీవుడ్ నటి రేణుదేశాయ్ తెలిపారు. దూలపల్లి మైనంపల్లి రోహిత్ నివాసంలో ప్రముఖ నటీ మణులు భాగ్య శ్రీ, రేణుదేశాయ్ సందడి చేశారు.
మైనంపల్లి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతుండటం అభినందనీయమని వారు అన్నారు. లాక్డౌన్ సమయంలో నిత్యావసరాలను అందించడంతోపాటు ప్రతినిత్యం పేద ప్రజల సమస్యలను తీర్చారని పేర్కొన్నారు. మైనంపల్లి సేవా సంస్థ మానవతా దృక్పథంతో ఉండటం గర్వకారణమని నటీమణులు కొనియాడారు. ఈ సేవా కార్యక్రమాలు ఎల్లప్పుడూ ఇదే విధంగా కొనసాగాలని వారు ఆకాంక్షించారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా పేద ప్రజలకు ఉచిత అంబులెన్స్ సౌకర్యం అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు మైనంపల్లి రోహిత్ తెలిపారు. నేడు బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించే విధంగా ప్రణాళిక రూపొందించినట్లు ఆయన వివరించారు.
ఇదీ చూడండి : గణతంత్ర వేడుకకు ఏర్పాట్లు పూర్తి.. ఎట్హోం కార్యక్రమం రద్దు