ETV Bharat / state

భాజపా కష్టపడి పనిచేసే పార్టీ: బండి సంజయ్​ - medchal district latest news

మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో భాజపా ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ పాల్గొన్నారు.

bandi sanjay
బండి సంజయ్​
author img

By

Published : Apr 4, 2021, 11:37 PM IST

భాజపా విసిటింగ్​ కార్డు, పత్రికా ప్రకటనల కోసం పనిచేసే పార్టీ కాదని, కష్టపడి పని చేసే పార్టీ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. కష్టపడి పని చేసే వారిని పార్టీ గుర్తిస్తుందని తెలిపారు. అంబేడ్కర్, పూలే వంటి గొప్ప వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకుని కార్యకర్తలు పని చేయాలని సూచించారు. మేడ్చల్​ జిల్లా మల్కాజిగిరిలో నిర్వహించిన భాజపా ఓబీసీ మోర్చా తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

జిల్లాల వారీగా ఓబీసీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాలని బండి సంజయ్​ సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో బీసీలను చీల్చే ప్రయత్నం చేస్తున్నారన్న ఆయన.. బీసీలకు సరైన న్యాయం చేస్తున్న పార్టీ భాజపా ఒక్కటే అని చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్​రావు, పలువురు స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'సాగర్​ పోరు': హోరెత్తిన ప్రచారం.. మండుటెండలోనూ ప్రజల్లోకి వెళుతున్న అభ్యర్థులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.