ETV Bharat / state

అవినీతి తిమింగళం... అనిశా వలలో జిల్లా పంచాయతీ అధికారి - అనిశా వలలో చిక్కిన పంచాయతీ అధికారి

లంచాలకు అలవాటుపడిన ఓ జిల్లా పంచాయతీ అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. ఓ వ్యక్తి నుంచి డబ్బులు తీసుకుంటూ... ఏసీబీ వలకు చిక్కాడు.

అనిశా వలలో చిక్కిన పంచాయతీ అధికారి
author img

By

Published : Nov 7, 2019, 10:40 PM IST

అనిశా వలలో చిక్కిన పంచాయతీ అధికారి

మేడ్చల్​-మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లి గ్రామ మాజీ సర్పంచ్​ భేరి ఈశ్వర్​ ఆడిట్​ రిపోర్ట్​ క్లియర్ చేయడానికి మేడ్చల్​ జిల్లా పంచాయతీ అధికారి రూ. 5 లక్షలు డిమాండ్​ చేశాడు. దీంతో బాధితుడు అనిశా అధికారులను ఆశ్రయించాడు. అధికారులు ఈరోజు ఈశ్వర్​తో రూ. లక్ష పంపించారు. కీసరలోని కలెక్టర్​ కార్యాలయ ప్రాంగణంలోని జిల్లా పంచాయతీ కార్యాలయంలోని డీపీఓ రవికుమార్​ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అనంతరం కొంపల్లిలోని అతని ఇంట్లో సోదాలు నిర్వహించగా... గతంలో రవికుమార్​ లంచాలు తీసుకున్న వీడియోలు బయటపడ్డాయి. దీంతో రవికుమార్​ ఇంటితోపాటు అతని బంధువుల ఇళ్లలోనూ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.

ఇదీ చూడండి: ఫిక్సింగ్ ఆరోపణలతో.. ఇద్దరు క్రికెటర్లు అరెస్ట్

TG_HYD_53_07_ACB TRAP_SODAALU_AV_TS10011 మేడ్చల్ జిల్లా కొంపల్లి లోని మేడ్చల్ జిల్లా పంచాయతీ అధికారి రవి కుమార్ ఇంట్లో ఏ.సి. బి సోదాలు.. మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ భేరీ ఈశ్వర్ ఆడిట్ రిపోర్ట్ క్లియర్ చేయడానికి 5 లక్షలు డిమాండ్ చేసిన జిల్లా పంచాయతి అధికారి రవికుమార్...భాదితుడు ఏ.సి.బి అధికారిలను ఆశ్రయించగా అందులో భాగంగా ఈ రోజు ఉదయం కీసర కలెక్టరు కార్యాలయం లో లక్ష రూపాయల నగదు ఇస్తుండగా రెడ్ హ్యండగ్ గా పట్టుకున్న ఏ.సి.బి అధికారులు..అనంతరం అతని కార్యాలయం లోను కొంపల్లి లోని అతని ఇంట్లో ( లక్ష్మి గణపతి నిలయం )లో సోదాలు చేస్తున్నారు.. ఈ విషయం ఏ.సి.బి అధికారులను వివరణ కోరగా మాట్లాడడానికి నిరాకరించారు...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.