ETV Bharat / state

సుమేధ కుటుంబానికి కాంగ్రెస్​ నేతల పరామర్శ - తెలంగాణ వార్తలు

నేరేడ్​మేట్ కాకతీయనగర్​లో రెండు రోజుల క్రితం నాలలో పడి మృతి చెందిన చిన్నారి... సుమేధ కుటుంబాన్ని కాంగ్రెస్​ నాయకులు పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్​ డిమాండ్​ చేశారు.

నాలాలో పడి మృతి చెందిన బాలిక కుటుంబానికి కాంగ్రెస్​ నేతల పరామర్శ

author img

By

Published : Sep 20, 2020, 5:33 PM IST

మేడ్చల్ జిల్లా నేరేడిమెట్​లో కాంగ్రెస్​ నేతలు పర్యటించారు. రెండురోజుల క్రితం ప్రమాదవశాత్తు నాలాలోపడి మృతి చెందిన బాలిక... సుమేధ కుటుంబాన్ని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, ఇతర నాయకులు పరామర్శించారు.

అనంతరం ప్రమాదం జరిగిన నాలా ప్రాంతాన్ని, బండ చెరువును పరిశీలించారు. జీహెచ్​ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. నాలాలపై వెంటనే కప్పులు వెయ్యాలని సూచించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి: సుమేధ ఘటనలో అధికారులపై కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.