మేడ్చల్ జిల్లా పేట్ బషీర్బాద్ ఆర్టీఏ కార్యాలయంలో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించిన అనంతరమే కార్యాలయం లోనికి అనుమతిస్తున్నారు. జిల్లా రవాణా అధికారి కిషన్ ఆదేశాల మేరకు ఆఫీసుకు వచ్చే ప్రజలు, కార్యాలయ సిబ్బందికి స్క్రీనింగ్ చేసిన తర్వాతే లోనికి అనుమతించాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రతి కౌంటర్ వద్ద రెండు మీటర్ల దూరం పాటించేలా గుర్తులు ఏర్పాటు చేశారు. మాస్కు లేకపోతే లోనికి అనుమతిలేదంటూ బోర్డులు ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి : మెడికల్ సీట్ల ఫీజు పెంపు సరికాదు: వంశీ చంద్‌రెడ్డి