నటుడు సోనూసూద్ మరోసారి తన మానవత్వం చాటుకున్నాడు. విద్యార్థులు చదువుతున్న పాఠశాల ఖాతాలో నగదు జమచేసి ఆదుకున్నాడు. కొన్నేళ్ల కిందట మల్కాజిగిరికి చెందిన విష్ణు, వైశాలి తల్లిని కోల్పోయారు. అప్పటి నుంచి మల్కాజిగిరి నెహ్రూనగర్‌లో అమ్మమ్మ వద్ద ఉంటూ స్థానిక పాఠశాలలో ఐదు, పదో తరగతి చదువుతున్నారు. నాలుగేళ్లుగా ఆ పిల్లలను చదివిస్తున్న స్థానిక వాట్సప్ గ్రూపు సభ్యులు కరోనా సమయంలో సామాజిక మాధ్యమం ద్వారా నటుడు సోనూసూద్‌ను సంప్రదించారు.
వెంటనే స్పందించిన ఆయన పాఠశాల ఖాతాలో రూ.20వేలు నగదు జమచేశారు. ఆర్థిక సాయం చేసిన సోనూసూద్‌కు చిన్నారులు, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో గ్రీన్ కవర్ 29 శాతానికి పెంచిన ఘనత మాదే: కేటీఆర్