ETV Bharat / state

ఒక్కొక్కరుగా బయటకొస్తున్న కీసర మాజీ తహసీల్దార్​ నాగరాజు బినామీలు - కీసర ఎమ్మార్వో నాగరాజు కేసు తాజా వార్తలు

కీసర మాజీ తహసీల్దార్​ నాగరాజు బినామీల పేర్లు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నాయి. శనివారం సికింద్రాబాద్​ బొల్లారంలో అతని బినామీ అయిన మహేందర్​ ఇంటిని అనిశా అధికారులు తనిఖీ చేశారు. బ్యాంకు అధికారులతో మాట్లాడి లాకర్​ను తెరుస్తామని వివరించారు.

keesara mro nagaraju binami houses acb rides
ఒక్కొక్కరుగా బయటకొస్తున్న కీసర ఎమ్మారో నాగరాజు బినామీలు
author img

By

Published : Oct 19, 2020, 9:01 PM IST

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు అక్రమాస్తుల కేసులో ఒక్కొక్కరిగా బినామీల పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ మేరకు సికింద్రాబాద్​ బొల్లారం సదర్​బజార్​లో అతని బినామీ ఇంటిని ఏసీబీ అధికారులు గుర్తించారు. నందగోపాల్​, నాగరాజు ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్నారని.. నందగోపాల్​ సోదరుడు మహేందర్​ ఐసీఐసీఐ బ్యాంకులో పని చేస్తున్నట్లు అనిశా డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.

కీసర ఎమ్మార్వో నాగరాజుతో నందగోపాల్​ మహేందర్​కు సత్సంబంధాలు ఉండేవని.. మహేందర్​ లాకర్​ను ఎమ్మార్వో, అతని భార్య స్వప్న పలుమార్లు ఉపయోగించుకునేవారని ఒప్పుకున్నట్లు పోలీసులు వివరించారు. బ్యాంకు అధికారులతో మాట్లాడి లాకర్​ను తెరిచి అందులో ఉన్న ఆస్తికి సంబంధించిన వివరాలను తెలిసుకునే ప్రయత్నం చేస్తామని అనిశా అధికారులు తెలిపారు.

ఇదీ చదవండిః నీటమునిగిన ఇళ్లు.. ఆదుకోవాలని బాధితుల వేడుకోలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.