మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలంలోని దేవరయాంజల్‌లోని సీతారామచంద్ర స్వామి దేవాలయ భూములపై అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. తూముకుంట మున్సిపాలిటీ కార్యాలయంలో అధికారులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా అప్పటి పంచాయతీ కార్యదర్శి మౌలనాను అధికారులు ప్రశ్నించారు.
సదరు భూముల్లో గోదాంలకు ఎలా అనుమతులు ఇచ్చారు? ఎవరైనా ఒత్తిడి తెస్తేనే అనుమతులు ఇచ్చారా? అని ప్రశ్నించారు. దర్యాప్తులో ఎవరైనా ప్రలోభాలకు గురి చేస్తారనే అనుమానంతో... సీత రామచంద్ర దేవాలయ కార్యనిర్వాహణ అధికారిని పక్కన పెట్టుకుని అధికారులు విచారణ జరుపుతున్నారు.