మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ పరిధిలో గుత్తేదారు వెంకటేశ్ గౌడ్ రూ.62 లక్షల అభివృద్ధి పనులు చేశాడు. బిల్లుల మంజూరు కోసం సీనియర్ అసిస్టెంట్ రాజేందర్ రెడ్డి లక్షా 80 వేల రూపాయల లంచం డిమాండ్ చేశాడు. రెండురోజుల క్రితం లక్ష ఇచ్చాడు. మిగతా రూ.80 వేలు ఇచ్చే ముందు అనిశా అధికారులను ఆశ్రయించాడు. ప్రణాళిక ప్రకారం మున్సిపాలిటీ కార్యాలయంలో రూ.50 వేలు ఇస్తుండగా రాజేందర్ రెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతనితోపాటు అసిస్టెంట్ ఆసిఫ్‌ను సైతం అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చూడండి;'హయత్ నగర్లో చెడ్డి గ్యాంగ్ హల్ చల్... 3 ఇళ్లల్లో చోరీ'