ఓ ప్రైవేటు పాఠశాలకు చెదిన బస్సు బోల్తాపడి... ముగ్గురు విద్యార్థులు గాయపడిన ఘటన మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధి గాజులరామారం బాలాజీ లే అవుట్ వద్ద జరిగింది. నవకేతన్ విద్యాసంస్థకు చెందిన బస్సు 15 మంది విద్యార్థులతో వెళ్తుండగా ఎత్తుగడ్డ ఎక్కుతుండగా బోల్తాపడింది.
ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. ఘటనలో ఎవరికీ ఏమీ జరగకపోవడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: పసివాడి శరీరంలో 12 సూదులు.. ఎలా తట్టుకున్నాడో పాపం.!