అక్రమంగా నిలువ ఉంచిన భారీ మొత్తం రేషన్ బియ్యాన్ని మల్కాజిగిరి పోలీసులు పట్టుకున్నారు. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బీజేఆర్‌నగర్‌లోని ఓ ఇంట్లో రేషన్ బియ్యాన్ని ముగ్గురు సభ్యుల ముఠా అక్రమంగా నిలువ ఉంచింది. వీటిని నిజామాబాద్, కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌కు తరలిస్తున్నారు.
ఇంటిపై దాడి చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 26 క్వింటాళ్ల బియ్యంతో పాటు ఒక అశోక్ లేలాండ్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.