ETV Bharat / state

మిషన్‌ భగీరథ నీటి వృథాపై ఎంపీ కొత్త ప్రభాకర్‌ ఆగ్రహం

author img

By

Published : Mar 21, 2021, 5:44 PM IST

వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కాళేశ్వరం నుంచి ఫిల్టర్ చేసిన మిషన్ భగీరథ నీళ్లను ప్రజలకు అందిస్తే వాటిని వృథాగా పోనిస్తున్నారని ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో జడ్పీ ఛైర్‌పర్సన్‌ హేమలత గౌడ్‌ ఆధ్వర్యంలో సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. తాగునీటికి వాడాల్సిన ఈ నీటిని సిమెంటు రోడ్లు, కూరగాయల పెంపకానికి వాడుతున్నారని ఎంపీ అసహనం వ్యక్తం చేశారు.

medak zilla parishad general plenary meeting
మెదక్‌ జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం

మెదక్‌ జిల్లాలో మిషన్‌ భగీరథ నీళ్లు వృథాగా పోవడంపై ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి మండిపడ్డారు. తాగునీటి అవసరాలకు ఆ నీటిని వినియోగించకుండా.. ఇతరత్రా వాటికి అధికారులు వినియోగిస్తున్నారని నిలదీశారు. కలెక్టరేట్‌లో జడ్పీ ఛైర్‌పర్సన్‌ హేమలత గౌడ్‌ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్‌ సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది.

మిషన్‌ భగీరథ నీళ్లు రావడం లేదని ఆర్‌డబ్ల్యూఎస్‌కు ఫిర్యాదులు వస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి అన్నారు. స్పందించిన కలెక్టర్ ఎస్‌. హరీశ్‌‌.. గ్రామాల వారీగా మూడురోజుల్లో సమస్యలను పరిష్కరించాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఐ కమలాకర్‌ను ఆదేశించారు.

టీకాపై నిర్లక్ష్యం తగదు..

జిల్లాలో 18 వేల కొవిడ్ వ్యాక్సిన్‌లు సిద్ధంగా ఉన్నాయని.. 60 సంవత్సరాల వయసు పైబడిన వారు.. టీకా వేసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వేంకటేశ్వర రావు సూచించారు. కరోనా టీకా పట్ల ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ రెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో ఎంపీటీసీలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: తెలంగాణ భ‌వ‌న్ వ‌ద్ద గన్​తో తెరాస నాయకుడి హల్​చల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.