మెదక్ జిల్లా శివ్వంపేట మండలం అల్లిపూర్ గ్రామంలో బుధవారం ఉద్రిక్తత నెలకొంది. గత రెండు రోజుల క్రితం పొలం వద్ద అన్నదమ్ములకు చిన్నగొడవ జరిగింది. ఆ సమయంలో తమ్ముడు మల్లేష్ అన్న రాములుపై పారతో దాడి చేశాడు. ఈ ఘటనలో అన్న రాములు తీవ్రంగా గాయపడ్డాడు. తక్షణమే ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రాములు చికిత్స పొందుతూ మరణించాడు.
దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు మల్లేశ్ ఇంటిని కూల్చివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామంలోకి వస్తుండడాన్ని గమనించి గ్రామస్థులు వారిని అడ్డుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనంతరం పోలీసులు, ప్రజాప్రతినిధులు గ్రామస్థులతో పలుమార్లు చర్చించగా శాంతించారు.
ఇవీ చూడండి: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి