రాజకీయ, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మెదక్ జిల్లా నర్సాపూర్ సమీపంలో గల విష్ణు ఫార్మసీ కళాశాల మహిళా అధ్యాపకులు అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కోశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్విహించిన పలు కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. విద్యార్థులు, అధ్యాపకులు కలిసి పాటలకు అనుగుణంగా నృత్యాలు చేశారు. మహిళలు పడుతున్న సమస్యలు వాటిని ఎలా ఎదుర్కోవచ్చు అనేవి అంశాలను కళ్లకు కట్టినట్టు చూపించారు.
సమాజంలో మహిళలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించాలని కోరారు. వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రత్యేక బహుమతులను అందజేశారు.
ఇవీ చూడండి: రామోజీ ఫిల్మ్ సిటీలో 'వసుంధర' పురస్కారాలు