కరోనా వైరస్ సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భార్యాభర్తలు గంటల వ్యవధిలోనే మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. మెదక్ జిల్లా చేగుంట పట్టణానికి చెందిన బచ్చు వెంకటేశ్(80), ఆయన భార్య బాలమని (75)కి వైరస్ నిర్ధరణ అయింది.
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో దంపతులిద్దరూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి శనివారం పొద్దున బాలమని మృతి చెందగా, సాయంత్రం భర్త వెంకటేశ్ మరణించారు.
ఇదీ చదవండి: ఆ ఏటీఎంలో రూ.100 తీస్తే 500.. రూ.వెయ్యి తీస్తే 5వేలు!