ఆర్టీసీ సమ్మె ఐదోరోజులో భాగంగా... మెదక్లో కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. స్థానిక గుల్షన్ క్లబ్ నుంచి రాందాసు చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ, ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలిపాయి. కార్మికులను ప్రలోభ పెడితే సమ్మె విరమిస్తారనుకోవడం శోచనీయమన్నారు. అన్ని సంఘాలు, రాజకీయ పార్టీల మద్దతుతో సమ్మె ఉద్ధృతం చేస్తామన్నారు. ప్రభుత్వం మీదనో, వ్యక్తిగత లాభాల కోసమో సమ్మె చేస్తలేమని.. సంస్థ ఆస్తులను కాపాడేందుకేనని తెలిపారు.
ఇదీ చూడండి : రెండ్రోజుల కస్టడీకి ఈఎస్ఐ నిందితులు