మెదక్ జిల్లా తూప్రాన్ రెవెన్యూ డివిజన్‌లోని మాసాయిపేటను కొత్త రెవెన్యూ మండలంగా ప్రతిపాదిస్తూ ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం చేగుంట మండలంలోని చెట్లతిమ్మాయిపల్లి, పోతంపల్లి, పోతంశట్‌పల్లి గ్రామాలు, ఎల్దుర్తి మండలంలోని మాసాయిపేట, రామంతాపూర్, అచ్చంపేట్, హకీంపేట్, కొప్పులపల్లి, లింగారెడ్డిపల్లి గ్రామాలతో మాసాయిపేటను కొత్త మండలంగా ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించింది.
దీనిపై అభ్యంతరాలు, సలహాలను 30 రోజుల్లోపు మెదక్ కలెక్టర్‌కు రాతపూర్వకంగా విన్నవించాలని ప్రభుత్వం పేర్కొంది.
ఇదీ చదవండి: మద్యం అమ్మకాలకు లాక్‌డౌన్ కిక్కు.. ఒక్కరోజే డబుల్