మెదక్ జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో తెరాస జోరు చూపించింది. మెదక్‌లో మొత్తం 32 వార్డులు ఉండగా.. 18 స్థానాల్లో అధికార తెరాస విజయ దుందుబి మోగించింది. మిగిలిన వార్డుల్లో కాంగ్రెస్ 09, భాజపా 03, ఇతరులు 02 స్థానాలను కైవసం చేసుకున్నారు.
తూప్రాన్‌లోనూ..
తూప్రాన్ మున్సిపాలిటీలోనూ తెరాస జోరే కనిపించింది. మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉండగా.. 11 స్థానాల్లో తెరాస గెలుపొందింది. మిగిలిన 5 వార్డుల్లో 02 స్థానాల్లో కాంగ్రెస్, 01 స్థానంలో భాజపా, 02 స్థానాల్లో ఇతరులు గెలుపొందారు.
నర్సాపూర్‌లో...
నర్సాపూర్‌లోనూ తెరాస గాలులే వీచాయి. మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు ఉండగా.. తెరాస అత్యధికంగా 08 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ పార్టీ అసలు ఖాతా తెరవగపోగా.. భాజపా 04, ఇతరులు 03 స్థానాల్లో విజయం సాధించారు.
రామాయంపేటలోనూ తెరాసకే పట్టం..
రామాయంపేట మున్సిపాలిటీలోనూ ప్రజలు తెరాసకే పట్టం కట్టారు. మొత్తం 12 వార్డులకు గానూ.. 08 స్థానాల్లో తెరాసనే విజయం సాధించింది. కాంగ్రెస్ 02, భాజపా 01, ఇతరులు 01 చోట విజయం సాధించారు.
![trs won in medak district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5837357_medak_nl.jpg)
ఇవీ చూడండి : మహిళ అనుమానాస్పద మృతి