మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి శివారులోని కార్తికేయ అనే పరిశ్రమలో బాయిలర్ లీకేజ్ కావడం వల్ల గ్రామంలో దట్టమైన పొగమంచు చుట్టేసింది. విషవాయువు వెలువడడం వల్ల గ్రామస్థులు అస్వస్థతకు గురయ్యారు. చిన్నపిల్లలకు, వృద్ధులకు శ్వాస ఆడటం లేదని, కళ్లు మండుతున్నాయని, అనారోగ్యానికి గురవుతున్నామని బాధితులు కంపెనీ ఎదుట ఆందోళన చేపట్టారు.
గ్రామస్థుల ఫిర్యాదు మేరకు అదనపు కలెక్టర్ నగేష్ కంపెనీని పరిశీలించారు. పరిశ్రమలో విషవాయువు వెలువడిందని మిర్జాపల్లి గ్రామస్థులు అస్వస్థతకు గురయ్యారని.. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా కంపెనీని మూసివేస్తున్నట్లు ఆయన తెలిపారు. కంపెనీ కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని రిపోర్టు ఇవ్వాలని కాలుష్య నియంత్రణ మండలి.. పరిశ్రమ యాజమాన్యానికి సూచించింది. వారి నుంచి నివేదిక వచ్చాక కార్తికేయ ఫ్యాక్టరీపై చట్ట ప్రకారం చర్యలు తగు చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. గ్రామంలో హెల్త్ క్యాంపు కూడా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు..
ఇవీ చూడండి: పారిశ్రామిక పార్కులకు కేంద్ర సహకారం కావాలి: కేటీఆర్